Breaking News

Amala Paul: మూడోసారి రొమాన్స్‌ చేసేందుకు రెడీ?

Published on Tue, 06/27/2023 - 08:49

నటుడు ధనుష్‌ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్‌ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ధనుష్‌ ప్రస్తుతం కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్‌ రాయ్‌ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

(ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల)

ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్‌, నటుడు విష్ణువిశాల్‌ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్‌ సరసన నటించే హీరోయిన్‌ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్‌ పేరు వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు)

ఇటీవల కోలీవుడ్లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించిన అమలాపాల్‌ ఇంతకుముందు ధనుష్‌కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్‌ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)