తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్
Published on Wed, 08/10/2022 - 07:13
Amala Paul About Cadaver Movie Releasing Problems: హీరోయిన్ అమలా పాల్ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం 'కడావర్'. నటుడు హరీష్ ఉత్తమన్, తిరికున్, వినోద్‌సాగర్, అతుల్య రవి, రిత్విక తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి అభిలాష పిళ్లై కథ అందించగా.. అనూప్ ఎస్. ఫణికర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 12వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం (ఆగస్టు 8) సాయంత్రం అమలాపాల్ విలేకరులతో ముచ్చటించారు.
ఇది మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని అమలా పాల్ తెలిపారు. రచయిత అభిషేక్ పిళ్లై, దర్శకుడు అనూప్ ఎస్. ఫణికర్ తనను కలిసి 'కడావర్' చిత్ర కథను చెప్పారన్నారు. అందులో తన పాత్ర కొత్తగానూ, బలమైనదిగానూ ఉండడంతో నటించడానికి అంగీకరించానన్నారు. చిత్రంపైన నమ్మకంతోనే నిర్మాతగా మారినట్లు చెప్పారు. ఇందుకు తన తల్లి, సోదరుడు ఎంతగానో సహకరించారని తెలిపారు. నాలుగేళ్లు కష్టపడి, పలు పోరాటాలు చేసి చిత్రాన్ని పూర్తి చేశామన్నారు.
చిత్రం విడుదల సమయంలోనూ పలు ఆటంకాలు ఎదురయ్యాయన్నారు. కొందరు చిత్రం విడుదలను అడ్డుకోవడానికి రహస్యంగా ప్రయత్నించారని ఆరోపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిత్రం విడుదల హక్కులను పొందినట్లు తెలిపారు. వరుసగా క్రైమ్, థ్రిల్లర్ హార్రర్ కథా చిత్రాలను చేయడంతో కాస్త రిలీఫ్ కోసం రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలను చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Tags : 1