Breaking News

ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్‌.. స్పందించిన అరవింద్‌

Published on Tue, 04/21/2026 - 11:45

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు ముంబైలో స్థిరపడనున్నారని వచ్చిన వార్తలపై అల్లు అరవింద్‌ స్పందించారు. ఈ మేరకు అధికారికంగా డెక్కన్ క్రానికల్‌లో ఒక కథనం వచ్చింది. బన్నీ- అట్లీ మూవీ రాకా షూటింగ్‌  ఎక్కువగా ముంబైలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని నెట్టింట కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని  ఆయన తండ్రి అల్లు అరవింద్‌ డెక్కన్‌ క్రానికల్‌తో తెలిపారు. 'బన్నీ కొత్త సినిమా షూటింగ్‌  ఎక్కువ భాగం ముంబైలో  జరుపుకుంటున్నందున చాలామందికి అలా అనిపించవచ్చు. కానీ, అర్జున్‌ మనసు హైదరాబాద్‌ చుట్టే ఉంటుంది. అతనికి సొంత ఇల్లు ఇక్కడే ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. తన స్నేహితులందరూ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.  అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తారు..? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకి లేవు. అయితే,  ప్రస్తుతం షూటింగ్‌ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.' అని అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో 'రాకా' సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ హైదరాబాద్, ముంబైల మధ్య ఎక్కువ రాకపోకలు సాగించే అవకాశం ఉంది.  తెలుగు సినిమాకు మించి తన సూపర్‌స్టార్‌డమ్‌ను విస్తరించుకోవాలనే ప్రణాళికలు లేవని తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే ఉంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్లాన్‌తో అల్లు అర్జున్‌ ఉన్నట్లు అర్థం అవుతుంది.

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)