మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
అల్లు అర్జున్ రాకా.. రిలీజ్ డేట్ వైరల్
Published on Fri, 09/04/2026 - 17:06
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ రాకా. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలు మరించ పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ నెట్టింట వైరల్గా మారింది.
ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2028 జనవరి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రాకా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్లో దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨
Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!
Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq— Movies Buster (@buster_movies) September 4, 2026
Tags : 1