Breaking News

'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్‌

Published on Sat, 12/27/2025 - 14:28

'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.  ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌ను, ఏ-11గా అల్లు అర్జున్‌(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన  మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్‌ చేశారు. 

గత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్  థియేటర్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్‌ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.  దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్‌లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై  కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)