Breaking News

ఆమిర్‌ని కలిసిన అల్లు అర్జున్‌.. భారీ ప్రాజెక్ట్‌ కోసమేనా?

Published on Wed, 05/07/2025 - 18:43

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan)తో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్‌ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్‌తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతుందని, దాని కోసమే ఆమిర్‌ని కలిశాడని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఆమిర్‌ తన తదుపరి చిత్రం  సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్‌తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్‌ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్‌ భేటీనే హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్‌ రోల్‌ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్‌ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)