Breaking News

ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్?

Published on Wed, 06/25/2025 - 10:35

'పుష్ప'తో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆచితూచి సినిమాలు ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. అప్పటికే ఓకే చేసిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ని  పక్కనబెట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీకి అవకాశమిచ్చాడు. త్వరలో షూటింగ్ మొదలయ్యే ఈ మూవీ ఓ రేంజులో ఉండబోతుందని ప్రమోషనల్ వీడియోల బట్టి అర్థమవుతోంది. దీని తర్వాత ఎవరితో చేస్తాడా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి ఓ సమాధానం దొరికినట్లు అనిపిస్తోంది.

మొన్నీమధ్యే 'తమ్ముడు' మూవీ ప్రమోషన్‌లో భాగంగా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఒకదానిలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అల్లు అర్జున్‌తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్‌తోనే అని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అది కూడా నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'రావణం' అని అంటున్నారు.

(ఇదీ చదవండి: అఖిల్‌కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?)

లెక్క ప్రకారం 'రావణం' సినిమాని ప్రభాస్‌తో తీయాలని నీల్ అనుకున్నాడట. కానీ ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న కమిట్‌మెంట్స్ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' చేస్తున్న నీల్.. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో కలిసి పనిచేస్తాడనిపిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ.

ఎందుకంటే కేజీఎఫ్, సలార్ సినిమాలతో తన స్టాండర్డ్ పెంచేసుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్‌తో మూవీ చేస్తున్నాడు. కేజీఎఫ్ 3, సలార్ 2 కూడా తీయాల్సి ఉంది కానీ అవి ఇప్పట్లో సాధ్యమవుతాయా? లేదంటే 'రావణం' తీసిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా అనిపిస్తుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రేజీ కాంబినేషన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంది. మరి వాటిలో ఎన్ని నిజమవుతాయో చూడాలి?

(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)