Breaking News

'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్‌ గెస్ట్‌గా బన్నీ

Published on Wed, 05/24/2023 - 14:35

సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘ తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టాప్‌-5 లిస్టులో ఉన్నారు.

త్వరలోనే  ఈ షో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఇక సీజన్‌ 1 ఫినాలేకి మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ఆ ప్రోమోను బట్టి చూస్తే అల్లు అర్జున్‌ ఎంట్రీ మాములుగా లేదనిపిస్తుంది.

తెలుగు ఇండియన్ ఐడల్ 2 వంటి అద్భుతమైన షో గ్రాండ్ ఫినాలేలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని బన్నీ అన్నారు.జడ్జి హోదాలో ఉన్నాను కానీ ఇంత మంచి పాటకు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తోందని చెప్పాడు. అంతకుముందు ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ సాంగ్‌తో స్టేజిపైకి బన్నీ ఎంట్రీ సెలబ్రేషన్‌ను తలపించగా.. గాయని సౌజన్య ఆరాధ్య కుమార్తె మిహిరాతో హ్యాపీ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)