Breaking News

ప్రభాస్‌ను పక్కకు నెట్టిన బ‌న్నీ.. ఏ విషయంలోనో తెలుసా?

Published on Fri, 03/10/2023 - 21:14

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పుష్ప-2 చిత్రంపైనే దృష్టి సారించారు. ఇటీవలే రాజస్థాన్ వేకేషన్‌కు వెళ్లిన బన్నీ అక్కడి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. అయితే తాజాగా బన్నీకి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది.   రెమ్యూనరేషన్‌ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ను దాటేశారని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న తొలి హిందీ మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు స‌మాచారం. 

ఒకవేళ అదే జరిగితే ప్రభాస్‌ను వెనక్కినెట్టి అత్యధిక రెమ్యూనరేషన్‌గా అందుకున్న టాలీవుడ్ హీరోగా నిలుస్తారు.  టీ సిరీస్ ప్రొడ‌క్ష‌న్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.125 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. బన్నీ ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నారని సమాచారం.  ఇటీవలే సందీప్ రెడ్డి వంగా, భూష‌ణ్ కుమార్‌ల‌తో అల్లు అర్జున్ ప‌నిచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  సందీప్‌రెడ్డితో కలిసి సూపర్ హిట్ సినిమా అందిస్తామ‌ని అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)