Breaking News

అల్లు అర్జున్‌కే అవార్డు అని ముందే హింట్‌ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్‌

Published on Sun, 08/27/2023 - 12:47

టాలీవుడ్‌ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని రికార్డును పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ క్రియేట్‌ చేశాడు.  69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం బన్నీకి దక్కింది. ఉత్తమ నటుడిగా జాతీయ  పురస్కారం అందుకున్న తొలి నటుడు ఆయనే అని ప్రకటన వచ్చాక. ఆయన షాక్‌కు గురయ్యాను అని కామెంట్‌ చేశారు. అంతలా ఈ అవార్డుకు ప్రాధాన్యత ఉంది. అల్లు అర్జున్‌కు అవార్డు దక్కడంతో డైరెక్టర్‌ సుకుమార్‌,మైత్రి మూవీ మేకర్స్‌ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?)

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ ఐకాన్‌ స్టార్‌గా ఎదిగాడు... ఇందులో నటించిన రష్మిక నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లీగా ఆమె నటన బాగా మెప్పిస్తుంది. పార్ట్‌-2లో శ్రీవల్లీ విశ్వరూపం మరో రేంజ్‌లో ఉంటుందని ఇప్పటికే సుకుమార్‌ కూడా తెలిపారు. తాజాగ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో గతంలో పుష్ప సక్సెస్‌ మీట్‌లో రష్మిక మాటలు మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించాను: రోహిణి)

పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్‌ మీట్‌లో నేషనల్‌ అవార్డు గురించి రష్మిక ఇలా  చెప్పింది.  'నేనైతే చెప్తున్నానండి.. పుష్పగారికి ఈసారి నేషనల్‌ అవార్డే కాదు.. ప్రతీ అవార్డు తప్పకుండా వస్తుంది. రాకపోతే మొదట హర్ట్‌ అయ్యేది నేనే అండి. ఆ స్క్రీన్‌ మీద ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్‌ వల్ల సినిమాను మరో స్థాయికి తీసుకుపోయింది. కేవలం మేకప్‌ కోసమే ఆయనకు ప్రతిరోజు సుమారు 3గంటల సమయం పడుతుండేది. ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది.' అని రష్మిక పేర్కొంది. తాజాగ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డు వస్తుందని రష్మిక అందరి కంటే ముందుగా ఎప్పుడో చెప్పిందని ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)