Breaking News

సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?

Published on Fri, 02/16/2024 - 18:17

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇతడి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి కొందరికి తెలుసు. పలు విద్యాసంస్థలు, వ్యాపారాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాంటిది తాజాగా ఈయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. 

(ఇదీ చదవండి: హీరో కార్తీకి రూ. కోటి చెక్‌ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్‌)

అదే కారణమా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. వీళ్లలో కొందరు కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ కూడా అలాంటిదేనని మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ అశించి భంగపడ్డ ఈయన.. కాంగ్రెస్ లో చేరారని, అలానే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు. గతంలో ఆ స్థానానికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా.. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తన అల్లుడు అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలిసివచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌ను కలిశా.. ఏం మాట్లాడానో అడగొద్దు: విశ్వక్‌ సేన్‌)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)