Breaking News

షూటింగ్‌ షురూ

Published on Sun, 01/25/2026 - 06:00

చిన్న బ్రేక్‌ తర్వాత షూటింగ్‌ షురూ చేశారు అల్లు అర్జున్‌. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్‌ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే.

 కాగా, కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమా జపాన్‌లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ జపాన్‌ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్‌లోని సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారని టాక్‌. 

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ యాక్టర్స్‌ కాజోల్, జిమ్‌ సర్బ్‌ నటిస్తున్నారనే టాక్‌ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది.   
 

Videos

ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది

BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN

2026 పద్మ పురస్కారాలు.. ప్రకటించిన కేంద్రం

ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..

జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు

ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!

కౌన్ కిస్కా గొట్టం..

పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన

హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్

కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్

Photos

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారశాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)