Breaking News

శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు

Published on Mon, 05/05/2025 - 12:20

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. 

శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)