Breaking News

మంచి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది 

Published on Thu, 11/06/2025 - 04:11

‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టి జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. 

అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘రాహుల్‌లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్‌ పర్సన్‌ మాత్రమే ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లాంటి సినిమా రూపొందించగలరు. 

మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్‌ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్‌ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌గా నిలుస్తుంది’’ అని రాహుల్‌ రవీంద్రన్‌ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

అంతుచిక్కని రహస్యం.. విశ్వంలో ఓ భారీ ఆకారం కదలిక

Photos

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు