Breaking News

అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం

Published on Sat, 08/30/2025 - 08:18

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అమ్మగారు, దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. నేడు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ ముంబై నుంచి,  రామ్‌ చరణ్‌ మైసూర్‌ నుంచి ప్రయాణమయ్యారు. వారిద్దరూ కూడా మధ్యాహ్నంలోపు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఇప్పటికే  చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మాత్రం అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అరవింద్‌ ఇంటికి వెళ్తున్నారు.

అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు నలుగురు సంతానం  ఉన్నారనే విషయం తెలిసిందే. వారిలో  అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మాత్రమే సినీ ఇండస్ట్రీకి  దగ్గరగా ఉన్నారు. వారి పిల్లలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్‌ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  అల్లు రామలింగయ్య 2004లో మరణించారు. అయితే, ఆయన సతీమణి కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించరు. తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు. ఆ తర్వాత పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్‌ జైలుకు వెళ్లి బెయిల్‌ మీద వచ్చిన తర్వాత బన్నీకి నాన్నమ్మే దిష్టి తీసింది. ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఆమె మాకు ఆదర్శం: చిరంజీవి
మా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య  సతీమణి కనకరత్నమ్మ  శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు.
 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)