Breaking News

నా కెరీర్‌లో మైలురాయిగా ‘ఉగ్రం’

Published on Mon, 05/01/2023 - 10:20

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ‘ఉగ్రం’ తన సినీ కెరీర్‌లో ఓ హైలెట్‌ చిత్రంగా నిలిచి పోతుందని ఆ చిత్ర హీరో అల్లరి నరేష్‌ స్పష్టం చేశారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఆదివారం చిత్ర యూనిట్‌ సందడి చేసింది. నాంది చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రమే ఉగ్రం. అల్లరి నరేష్‌కు జతగా మిర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో నరేష్‌ మాట్లాడుతూ తన 60వ చిత్రం ఉగ్రంతో మీ ముందుకు వస్తున్నానన్నారు. నాంది సినిమాకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మిస్సింగ్‌ కేసుల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా సాగుతుందన్నారు.

(చదవండి: అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్‌ ఝాన్సీ ఎమోషనల్‌)

కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసిందేనని, వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదంటూ రూపొందించిందే ఉగ్రం చిత్రమని పేర్కొన్నారు. ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నరేష్‌ తెలిపారు. మిస్సింగ్‌ కేసులు పరిష్కరించే పోలీస్‌ పాత్రలో నటించానని, ఇప్పటి వరకు ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. హీరోయిన్‌ మిర్నా మీనన్‌ మాట్లాడుతూ తెలుగులో ఇది తనకు రెండో చిత్రమన్నారు. అల్లరి నరేష్‌ చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించగా, కెమెరామన్‌గా సిద్‌ వ్యవహరించారన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)