Breaking News

ఇంకెందుకు రా నీ బతుకు!

Published on Fri, 09/05/2025 - 02:18

‘లక్షలు లక్షలు సంపాదిస్తావ్‌... కానీ మందు తాగవ్‌... ఇంకెందుకు రా నీ బతుకు’ (నటుడు సత్య), ‘తాగుడికి సంపాదనకి లింకేముంది సార్‌’ (నరేశ్‌) అనే డైలాగ్స్‌తో ‘ఆల్కహాల్‌’ మూవీ టీజర్‌ ఆరంభమైంది. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా, రుహానీ శర్మ, నిహారిక ఎన్‌.ఎం. హీరోయిన్లుగా రూ పొందుతోన్న చిత్రం ‘ఆల్కహాల్‌’. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సత్య, గిరీష్‌ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేశ్‌ కాకుమాను, కిరీటి ఇతరపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. ‘‘ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ డ్రామాగా రూ పొందుతోన్న చిత్రం ‘ఆల్కహాల్‌’.

హీరో జీవితాన్ని మద్యం ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం, తాగడానికి ముందు, తాగిన తర్వాత అతని ప్రవర్తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారంతో ఈ సినిమా రూ పొందుతోంది. మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు నరేశ్‌. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, కెమెరా: జిజు సన్నీ.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)