Breaking News

సీక్రెట్‌గా నా ఫోటోలు తీశారు.. సరైనా పనేనా?.. అలియా ఫైర్‌

Published on Wed, 02/22/2023 - 11:24

సినీ ప్రముఖుల పర్సనల్‌ విషయాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాళ్లు ఎం చేస్తారు?  ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అయితే అది కొంతవరకు బాగానే ఉన్నా..ఒక్కోసారి వారిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. వాళ్లకు ప్రైవసీని భంగం కలించినట్లవుతుంది.

తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌కు అలాంటి ఘటనే ఎందురైంది.ఆమె లివింగ్‌ రూమ్‌లో కూర్చొని ఉండగా.. సీక్రెట్‌గా ఫోటోలు తీసేందుకు ఇద్దరు ఫోటో గ్రాఫర్లు ప్రయత్నించారు. పక్క బిల్డింగ్‌ టెర్రస్‌పై నిలబడి కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా.. సోషల్‌ మీడియా వేదికగా వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది.

‘నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండగా.. ఎవరో నన్ను గమనించినట్లు అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఇద్దరు వ్యక్తులు పక్క బిల్డింగ్‌పై  నుంచి కెమెరాలతో నా ఫోటోలు తీస్తున్నారు. ఇది సరైన పనేనా? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించాలనే విషయం తెలియదా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది.  ఇన్‌స్టా పోస్ట్‌లో ముంబై పోలీసుకు ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. నా కూతురి విషయంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఫోటోలను తీయొద్దని ఎంత రిక్వెస్ట్‌ చేసినా..వారు ఆమె ఫోటోలను నెట్టింట పెట్టారు’అని రాసుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్‌ స్పందిస్తూ.. ‘ఆది అసహ్యమైన చర్య. నా విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాకు తెలియకుండా.. నా పర్మిషన్‌ లేకుండా ఫోటోలు తీశారు’చెప్పింది. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు