Breaking News

రియల్‌ హీరో అంటే మీరే!

Published on Sat, 07/19/2025 - 00:14

వెండితెరపై మంచి పనులు చేసి, హీరో అనిపించుకుంటారు స్టార్స్‌. అది ‘రీల్‌ హీరో’. అదే తెర వెనుక మంచి పనులు చేస్తే ‘రియల్‌ హీరో’ అనిపించుకుంటారు. ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ని అందరూ ‘రియల్‌ హీరో అంటే మీరే’ అంటున్నారు. మరి... 650 మంది స్టంట్‌మెన్, ఉమెన్‌కి బీమా చేయిస్తే ఆ మాత్రం అభినందించాల్సిందే కదా. ఇటీవల తమిళ చిత్రం ‘వేట్టువం’ షూటింగ్‌లో స్టంట్‌ మేన్‌ రాజు గుండెపోటుతో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కారుతో స్టంట్స్‌ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

మామూలుగా ఫైట్‌ సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు కూడా ప్రమాదాలకు గురై, స్టంట్‌ వర్కర్స్‌ మరణిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అక్షయ్‌ కుమార్‌ తాజాగా 650 మంది స్టంట్‌ మెన్, ఉమెన్‌కి బీమా చేయించారు. ఈ విషయం గురించి బాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ విక్రమ్‌ సింగ్‌ స్పందిస్తూ  – ‘‘మీరు (అక్షయ్‌ని ఉద్దేశించి) చేసిన ఈ మంచి పని వల్ల బాలీవుడ్‌లో 650 మంది స్టంట్‌ వర్కర్స్‌ బీమా పరిధిలోకి వచ్చారు.

ఈ ఇన్సూరెన్స్‌ పాలసీలో రూ. 5 లక్షల నుంచి 5.50 లక్షల వరకూ నగదురహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంది. అది షూటింగ్‌ సెట్‌లో అయినా విడిగా అయినా. మీకెలా ధన్యవాదాలో చె΄్పాలో తెలియడంలేదు అక్షయ్‌ సార్‌’’ అని పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)