Breaking News

సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్‌ కుమార్‌

Published on Thu, 01/18/2024 - 10:37

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా తాజాగా మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది. 50 ఏళ్ల వయసులో లండన్‌ యూనివర్సీటీ((గోల్డ్‌స్మిత్స్‌) నుంచి మాస్టర్స్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

(చదవండి: నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి)

‘చదువుకోవాలని ఉందని రెండేళ్ల క్రితం నువ్వు నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్‌, పిల్లలను అన్నింటిని చూసుకుంటూ చదువు ప్రయాణాన్ని కొనసాగించి, విజయం సాధించావు.  నేను సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్‌ మై లవ్‌’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ట్వింకిల్‌ పట్టా అందుకున్న సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోని షేర్‌ చేశాడు. అక్షయ్‌ పోస్ట్‌పై ట్వింకిల్‌ ఖన్నా స్పందిస్తూ.. ‘ప్రొత్సహించిన భర్త దొరకడం నా అదృష్టం’అని అన్నారు. 

(చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి)

ఇక ట్వింకిల్‌ ఖన్నా విషయానికొస్తే.. తల్లిదండ్రులు డింపుల్‌ కపాడియా, రాజేశ్‌ ఖన్నా వారసురాలిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ‘బర్సాత్‌’(1995) ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాన్‌’, ‘దిల్‌ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది.వెంకటేష్‌ హీరోగా నటించిన ‘శీను’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ.. ట్వింకిల్‌ నటించలేదు. అక్షయ్‌తో పెళ్లి తర్వాత నటనతో గుడ్‌బై చెప్పింది. వీరిద్దరికి  వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)