Breaking News

నాన్న కోసం మనం... కొడుకు కోసం లెనిన్‌ 

Published on Thu, 07/09/2026 - 05:56

‘‘నేను ఎక్కువగా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది ‘మనం’ చిత్రం కోసమే. అది నాన్నగారి కోసం (అక్కినేని నాగేశ్వరరావు) చేశాను. ఇప్పుడు నా కొడుకు అఖిల్‌ కోసం ‘లెనిన్‌’కి చేస్తున్నాను. ఏ తండ్రి అయినా కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు. కొడుకు సక్సెస్‌ అయితే తండ్రి సంతోషిస్తాడు. ప్రేమతో, ఇష్టంతో చేసిన ‘లెనిన్‌’ సినిమాకి ఆడియన్స్‌ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని నాగార్జున అక్కినేని తెలిపారు. 

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నందు (మురళీ కిషోర్‌) ఈ కథను అద్భుతంగా రాశారు. ‘లెనిన్‌’ కథలో ఉండే పెయిన్‌ని తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు అఖిల్‌. 

నేను ఈ సినిమాలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాక కథ విషయంలోనూ ఎక్కువగా కల్పించుకున్నాను. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం ఈ చిత్రాన్ని చేయలేదు. అందుకే మాకు సంతృప్తి అనిపించేంత వరకూ విడుదల కోసం ఆగాం. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నా... జూలై 10న వస్తున్నాం... కొడుతున్నాం... మనోడు కొడుతున్నాడు’’ అని పేర్కొన్నారు. 

అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘మన మూలాలకు, తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ‘లెనిన్‌’ కథ ఉంటుంది. ఈ మూవీ కోసం మేం నిజాయితీగా కష్టపడ్డాం’’ అని చె΄్పారు. ‘‘లెనిన్‌’లాంటి మంచి సినిమా చేశామని గర్వంగా చెప్పగలను’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. మురళీ కిషోర్‌ అబ్బూరు మాట్లాడుతూ– ‘‘అఖిల్‌గారు తొలిసారి విలేజ్‌ కుర్రాడి పాత్రను పోషించిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘లెనిన్‌’లో నేను చేసిన భారతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)