Breaking News

నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న వేళా విశేషం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్

Published on Tue, 02/11/2025 - 21:41

అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తండేల్ మూవీ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు ‍అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్‌ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్‌ మీట్‌కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు❤️. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)