Breaking News

కేన్సర్‌తో బెడ్‌ మీద నుంచే ఏఎన్నార్‌ డబ్బింగ్‌.. అక్కినేని అమల ఎమోషనల్‌

Published on Sun, 07/17/2022 - 12:16

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: ‘మా మామ గారు అక్కినేని నాగేశ్వర్‌రావు చివరి వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. కేన్సర్‌తో బాధపడుతూనే ‘మనం’ సినిమాకు పనిచేశారు. చివరి దశలో హాస్పిటల్‌ బెడ్‌పైనుంచే ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో తాను ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపానని, మీరు విచారించాల్సిన అవసరం లేదని ఆయన మా అందరికీ చెప్పేవారు’ అని  మామయ్య అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ అక్కినేని అమల ఎమోషనల్‌ అయ్యారు.

కేన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచేందుకు  గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ కేన్సర్‌ అవగాహన పరుగు పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించకపోవడం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్‌ విజృంభణకు కారణాలన్నారు.

కలుపు మందులు, పురుగుమందులు చాలా వరకు కేన్సర్‌కు కారణమవుతాయని తెలిసినా వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రేస్‌ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఫౌండేషన్‌ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్‌ ప్రమీలారాణి, గ్లోబల్‌ రేస్‌ డెరైక్టర్‌ నిరంజన్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)