Breaking News

సెంచరీతో విజృంభించిన 'అక్కినేని అఖిల్‌'

Published on Sun, 01/18/2026 - 07:13

సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌)లో తెలుగు వారియర్స్‌ మొదటి విజయం అందుకుంది. కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌ దూకుడుతో చెలరేగిపోయాడు..  ఫోర్లు, సిక్సర్లతో ఏకంగా సెంచరీ కొట్టాడు. దీంతో అభిమానుల్లో జోష్‌ నింపాడు.  శనివారం సాయింత్రం వైజాగ్ వేదికగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్‌ దే షేర్‌ జట్టుపై తెలుగు వారియర్స్‌  52 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్‌)-2026 సీజన్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌ (101 పరుగులు 56 బంతుల్లో 7×4, 6×6) సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు.  అశ్విన్‌ బాబు (60 పరుగులు 51 బంతుల్లో 9×4)తో నిలిచాడు. తమన్‌ 4బంతుల్లో కేవలం 1రన్‌తో  ఔట్‌ అయ్యాడు.

భారీ స్కోర్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ దే షేర్‌ జట్టు 18.2 ఓవర్లలోనే కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తెలుగు వారియర్స్‌ బౌలర్లలో వినయ్‌ మహదేవ్‌ 3, సామ్రాట్‌ 2 రెండు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకంగా నిలిచారు.  పంజాబ్‌ దే షేర్‌ జట్టు నుంచి కరణ్‌వాహి 56, హర్డీ సంధు 28 పరుగులతో టాప్‌లో నిలిచారు. చాలామంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి పాలయ్యారు. తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌ అఖిల్‌ 6 సిక్స్‌లతో ప్రేక్షకులను అలరించాడు. ఏకంగా సెంచరీ కొట్టడంతో ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)