Breaking News

Akhanda 2: అఖండ 2 ట్విటర్‌ రివ్యూ.. నెటిజన్స్‌ ఏమంటున్నారు?

Published on Fri, 12/12/2025 - 03:55

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘అఖడ 2- తాండవం’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్‌ ఇది. 14 రీల్స్‌ ప్లస్‌  బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 5నే విడుదల కావాల్సింది కానీ..చివరి నిమిషంలో ఆగిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బొమ్మ పడిపోయింది.

దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.  అఖండ 2 ఎలా ఉంది? బాలయ్య ఖాతాలో హిట్‌ పడిందా లేదా..తదితర విషయాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

ఎక్స్‌లో అఖండ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌ అని కొంతమంది అంటుంటే.. అసలే బాగోలేదని ఎక్కువ మంది చెబుతున్నారు.  కథ-కథనం ఊహకందేలా ఉందని, యాక్షన్‌ సీన్లు కూడా రొటీన్‌గా ఉన్నాయని చెబుతున్నారు. మరికొంత మంది నెటిజన్స్‌ అయితే బాలయ్య రిటైర్‌ అయిపోతే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. (Akhanda 2 Movie Twitter Review)

 

నాలోని సినీ ప్రియుడు అఖండ 2 చూడమని ప్రేరిపించాడు. సినిమా చూసి చాలా నిరాశ పడ్డాను. బాలయ్య నుంచి వచ్చిన ఒక లాజిక్‌లెస్‌ మూవీ ఇది. బాలయ్య దయచేసి రిటైర్‌ అయిపో’ అంటూ ఓ నెటిజన్‌ కేవలం 1.5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.

 ఇప్పుడే సినిమా చూశాను. ఆ పరమశివుడి భక్తులు, సనాతన ధర్మ ఫాలోవర్స్‌ కూడా ఈ సినిమాను కాపాడలేరు. క్రింజ్‌ సినిమా అంటూ ఓ నెటిజన్‌ 2 రేటింగ్‌ ఇచ్చాడు.

 


 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)