Breaking News

AK 62: త్రిష కాదు.. సాయి పల్లవి కాదు.. కీర్తి సురేశ్‌ ఫైనల్‌!

Published on Tue, 01/24/2023 - 09:08

తమిళ సినిమా: అజిత్‌ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌ సందర్భంగా ఈ నెల 11వ తేదీ విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక అజిత్‌ సంగతి తెలిసిందే. నటించి పూర్తి చేశాను... అంతవరకే అన్నట్లు ఉంటుంది ఈయన ధోరణి.

ప్రస్తుతం ఈయన తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి  తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి చిత్త యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్‌ సరసన నటించే హీరోయిన్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందుగా నటి నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత నటి  ఐశ్వర్యరాయ్, సాయి పల్లవి పేర్లు వినిపించాయి.

తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఆవిడే కీర్తి సురేశ్‌. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్‌ ఒకరు కాగా, రెండో హీరోయిన్‌గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కీర్తి సురేష్‌ పంట పండినట్లే. ఇప్పటికే ఈమె నటుడు రజనీకాంత్, విజయ్, సూర్య, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించారు. అజిత్‌కు జంటగా నటించాలనే ఆసక్తిని ఇటీవల ఆమె ఒక భేటీలో వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)