Breaking News

ప్రేమతో పాటు, వారి ద్వేషాన్ని కూడా స్వీకరిస్తా: అజిత్‌

Published on Sat, 08/07/2021 - 17:28

తమిళ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోల్లో అజిత్‌ ఒక్కడు. భిన్నమైన పాత్రలు, ఛాలెంజిగ్‌ క్యారెక్టర్స్‌ ఎంచుకుని విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అజిత్‌. అందుకే ఆయనను అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకుంటారు. తన సహజమైన నటన, సోషల్‌ యాక్టివిటిస్‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ టాలెంట్‌ హీరో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ముప్పై ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు, తనను ద్వేషించే వారికి ఓ మెసేజ్‌ ఇచ్చాడు. 

అయితే అజిత్‌ సామాజిక సేవలు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. పలు ఫౌండేషన్స్‌కు విరాళాలు ఇవ్వడం, వరదలు, తుఫాన్‌ల వల్ల నష్టపోయిన వారికి చేయితను ఇచ్చే హీరోల్లో ఆయన ముందు వరుసలో ఉంటాడు. అలా రియల్‌ హీరోగా కూడా మంచి పేరు సంపాదించుకున్న అజిత్‌ను తమిళనాడులో అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో, ద్వేషించే వారు సైతం అంతే ఉన్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్‌, కొంతమంది నెటిజన్లు అజిత్‌పై తరచూ విమర్శలు చేస్తుంటారు. అంతేగాక ఆయనను ట్రోల్‌ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అజిత్‌ అభిమానులకు, హేటర్స్‌కు, ఇతరులకు సోషల్‌ మీడియా వేదికగా సందేశం ఇచ్చాడు.

అజిత్‌ తన పోస్ట్‌లో.. ‘ఫ్యాన్స్‌, హేటర్స్‌, న్యూట్రల్స్‌.. ఒకే నాణానికి ఉన్న మూడు ముఖాల్లాంటి వారు. ఫ్యాన్స్‌ పంచే ప్రేమ, పడని వారు పంచే ద్వేషాన్ని, న్యూట్రల్‌గా ఉండేవారి అభిప్రాయాలన్నింటిని నేను స్వీకరిస్తాను. లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌. ఆల్వేస్‌ అన్‌ కండిషనల్‌ లవ్‌’ అని ఉన్న మెసేజ్‌ను అజిత్‌ మేనేజర్‌ అజిత్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశాడు. దీంతో ఈ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారింది. అభిమానులను మాత్రమే కాకుండా తనని ద్వేషించే వారిని కూడా యాక్సెప్ట్‌ చేయడం ఒకే అజిత్‌కే చెల్లిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక తమదైన శైలిలో తాలపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. కాగా అజిత్‌ ప్రస్తుతం వలిమై మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌కు విశేషన స్పందన వచ్చింది. 

#

Tags : 1

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)