కరూర్‌ ఘటన.. తప్పు 'విజయ్‌'ది మాత్రమే కాదు: అజిత్‌

Published on Sat, 11/01/2025 - 09:34

తమిళనాడులో జరిగిన‌ కరూర్ తొక్కిసలాటపై తొలిసారి నటుడు అజిత్‌ స్పందించారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఈ అంశంలో విజయ్‌తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాలకు చెందిన వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్‌ సూచించారు.

అజిత్‌ తాజాగా ఇంగ్లీష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరూర్‌ ఘటన గురించి ఇలా మాట్లాడారు. ' కరూర్‌ లాంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పలాన వ్యక్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను ఎవరినీ వేలెత్తి చూపించడం లేదు.

ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది. ఇది ఆ ఒక్క వ్యక్తి (విజయ్‌) తప్పు కాదు. కానీ, అందులో మన తప్పు కూడా ఉంది. దానికి మనమందరం బాధ్యులమే. క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు చాలామంది వెళ్తారు. కానీ, వారందరూ కూడా చాలా సురక్షితంగానే తిరిగొస్తారు. అయితే, సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్‌ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీడియా వీటిపై మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుంది. సినిమా థియేటర్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంది. కేవలం ఇండస్ట్రీ చుట్టే ఇలా జరగడంతో పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది.' అని అజిత్‌ పేర్కొన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)