కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్
Published on Tue, 03/31/2026 - 11:24
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. కాస్తా గ్యాప్ దొరికితే కార్ రేసింగ్‌లో దిగిపోతుంటారు. తాజాగా అజిత్ కుమార్ చెన్నైలోని ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. తన భార్య షాలినితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ఎఫ్‌సీ మద్రాస్ నిర్వహించిన ఈవెంట్లో అజిత్, షాలిని సందడి చేశారు. ఈ సందర్భంగా అజిత్ బిర్యానీ వండుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో షాలిని.. తన భర్తను ఆటపట్టించారు. నేను చెప్పినట్లుగా చేసావా? అంటూ అజిత్‌ను సరదాగా అడిగింది. ఆ తర్వాత అజిత్ దంపతులకు తాము అతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ఎఫ్‌సీ మద్రాస్ పేర్కొంది. మనదేశానికి మోటార్‌స్పోర్ట్స్.. అలాగే దేశాన్ని ప్రపంచ రేసింగ్ పటంలో నిలపాలన్న అజిత్ కుమార్ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఛాంపియన్లను తయారు చేయడంలో.. భారతదేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అజిత్‌తో కలిసి పనిచేస్తామని ఎఫ్‌సీ మద్రాస్ ప్రకటించింది.
ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి జత కట్టనున్నారు. ఇంకా ఈ మూవీ పనులు ప్రారంభించలేదు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నారు.
Shalini mam - naa sona Mari paniyacha 😁
Ajith enga paru 🤩 Pookie couples 😁#AjithKumar #ShaliniAjithKumar #AK pic.twitter.com/G95wNgI9tS— AJITH FANS COMMUNITY (@TFC_mass) March 30, 2026
Tags : 1