Breaking News

తెలుగు సినిమా.. నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో!

Published on Tue, 06/10/2025 - 16:44

చిత్ర పరిశ్రమలో చాన్స్‌ దొరకడమే కష్టం కానీ..ఒక్కసారి చాన్స్‌ వచ్చి, మంచి హిట్‌ పడితే..ఇక ఆ నటీనటులకు తిరుగుండదు. వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది ఆ ‘ఒకే ఒక చాన్స్‌ ’కోసం ఎదురు చూస్తుంటారు. అలా వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని నిరూపించుకుంటే.. కొన్ని ఏళ్ల వరకు ఢోకా ఉండదు. ముఖ్యంగా హీరోలకైతే వయసు మీద పడినా.. సినిమా చాన్స్‌లు తగ్గవు. ఒకవేళ తగ్గినా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానో.. క్యామియో రోల్‌గానో మెరిసి సొమ్ము చేసుకుంటారు.

 మరికొంతమంది హీరోలు అయితే సోలోగా సినిమాలు చేస్తూనే..అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్‌ ప్లే చేస్తుంటారు. అలాంటి వారిలో అజయ్‌ దేవగణ్‌ ఒకరు. ఒకవైపు సోలో హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిధి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే ఈ స్టార్‌ హీరో క్యామియో రోల్‌ చేసినా..రెమ్యునరేషన్‌ మాత్రం హీరో స్థాయిలోనే తీసుకుంటున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ. 4.35 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అయితే ఈ చిత్రానికిగానే అజయ్‌ భారీగానే పారితోషికంగా పుచ్చుకున్నాడట. 

ఈ ఒక్క చిత్రానికి రూ. 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అజయ్‌ కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ లెక్కన నిమిషానికి రూ.4.35 కోట్ల చొప్పున ఆయన తీసుకున్నాడు. క్యామియో రోల్‌కి ఈ స్థాయి రెమ్యునరేషన్‌(నిమిషాలతో పోల్చి చూస్తే) తీసుకుంటున్న నటుల్లో అజయ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే హీరోగా చేస్తున్న సినిమాలకు మాత్రం ప్రాజెక్ట్‌ని బట్టి పారితోషికం తీసుకుంటాడట. బడా ప్రాజెక్టు అయితే రూ. 40 కోట్లు తీసుకునే అజయ్‌.. రైడ్‌ 2 వంటి చిన్న చిత్రాలకు సగం తగ్గించి రూ. 20 కోట్ల వరకే తీసుకుంన్నాడట. అజయ్‌ ప్రస్తుతం దేదే ప్యార్‌ దే 2, సన్నాఫ్‌ సర్ధార్‌ 2, దృశ్యం 3 వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)