Breaking News

'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!

Published on Sun, 10/29/2023 - 13:20

‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది.

(ఇది చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్‌)

అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. 
 
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్‌పై నిజమేనంటూ కథనాలు హల్‌చల్‌ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్‌తో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో.

అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.  కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు.  అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్‌, లయనీస్‌ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. 

(ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)