Breaking News

చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్

Published on Fri, 05/17/2024 - 09:55

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్‌ సరికొత్త డిజైనర్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్‌ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్‌ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే  ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్‌ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది.  డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్‌లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్‌ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. 

గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్‌ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)