Breaking News

సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌.. ఐశ్వర్యరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 04/29/2023 - 04:10

‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్‌. ‘ఈ మధ్య  కాలంలో బాలీవుడ్‌ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి.

దీనిపై ఐశ్వర్యా రాయ్‌ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను.

ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్‌గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)