Breaking News

మణిరత్నం థగ్‌ లైఫ్‌లో... 

Published on Fri, 01/12/2024 - 02:21

హీరో కమల్‌హాసన్‌–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ‘నాయగన్‌’–1987 (‘నాయకుడు’) తర్వాత 37 ఏళ్లకు రూపొందనున్న తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, ‘జయం’ రవి, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్‌ ఖరారయ్యారు. తాజాగా ఐశ్వర్యా లక్ష్మి ఈ జాబితాలో చేరారు. ఈ చిత్రంలో ఆమె నటించనున్నట్లు గురువారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇక మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే... ‘థగ్‌ లైఫ్‌’లోకి ఐశ్వర్యా రాయ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

మణిరత్నం దర్శకత్వంలో ‘ఇద్దరు, గురు, రావణ్, పొన్నియిన్‌ సెల్వన్‌’ వంటి చిత్రాల్లో ఐశ్వర్యా రాయ్‌ నటించారు. మరి... ‘థగ్‌ లైఫ్‌’లో ఆమె నటించనున్నది నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరులో షూటింగ్‌ ఆరంభమయ్యే చాన్స్‌ ఉందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)