Breaking News

'ఏజెంట్‌' సినిమాతో వాళ్ల కెరీర్‌ పోయింది: నిర్మాత

Published on Tue, 01/06/2026 - 10:12

అఖిల్‌ అక్కినేని సినిమా ఏజెంట్‌ నష్టాల గురించి నిర్మాత అనిల​్‌ సుంకర మరోసారి రియాక్ట్‌ అయ్యారు. శర్వానంద్‌ (Sharwanand) హీరోగా అనిల్‌ సుంకర నిర్మించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఆరోజు సాయింత్రం 5:49 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మూవీకి సామజవరగమన ఫేమ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్‌ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ క్రమంలోనే ఏజెంట్‌ సినిమాతో పాటు అఖిల్‌ కెరీర్‌ గురించి మాట్లాడారు.

'ఏజెంట్‌ సినిమా వల్ల మేము అందరం నష్టపోయాం. ముఖ్యంగా అఖిల్‌, దర్శకుడు సురేంద్ర రెడ్డి కెరీర్‌ పరంగా బాగా నష్టపోయారు. మూడేళ్లుగా వారికి సినిమాలు లేవు. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. అయితే, అఖిల్‌కు హిట్‌ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. నేను డబ్బులు మాత్రమే కోల్పోయాను. కానీ, అఖిల్‌ కెరీర్‌ ఏజెంట్‌ సినిమాతో దెబ్బతినింది. అదొక్కటే బాధ నాలో ఉంది. 

నాతో ఇప్పటికీ అఖిల్‌ టచ్‌లోనే ఉన్నాడు. తనతో ఒక సినిమా తీయాలని నేను చాలా కథలను పంపుతూనే ఉన్నాను. అయితే, భారీ బడ్జెట్‌తో వద్దని ఏదైనా తక్కువ బడ్జెట్‌తో ప్లాన్‌ చేయమని తను సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్‌ పెట్టి మరోసారి సాహసం వద్దని సూచిస్తున్నాడు. తను చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాం.' అని ఆయన అన్నారు. 

'ఏజెంట్' మూవీ ఫ్లాప్ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ తీసుకున్న అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇందులో భాగ్యశ్రీ  హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు