Breaking News

‘ఏజెంట్‌’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..?

Published on Sat, 04/29/2023 - 16:02

అక్కినేని హీరో అఖిల్‌ నటించిన లేటెట్‌ మూవీ ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్‌ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్‌ వర్గాల ప్రకారం  ఈ చిత్రం ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్‌ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

(చదవండి: కొడుకుపై ట్రోలింగ్‌.. తొలిసారి రియాక్ట్‌ అయిన అమల అక్కినేని) 

ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర - రూ. 54 ల‌క్ష‌లు, ఈస్ట్ - రూ. 29 ల‌క్ష‌లు, వెస్ట్ - రూ. 30 ల‌క్ష‌లు, గుంటూరు - రూ. 52 ల‌క్ష‌లు, కృష్ణా - రూ. 22 ల‌క్ష‌లు, నెల్లూరు - రూ. 16 ల‌క్ష‌లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి.అఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌(సుమార్‌ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్‌గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు.

(చదవండి: బాక్సాఫీస్‌ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్‌ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..)

కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం కష్టమేనని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్‌గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్‌లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్‌గా కాబోతున్నట్లు తెలుస్తుంది. ​కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)