Breaking News

ఏడేళ్ల తర్వాత స్పెషల్‌ సాంగ్‌తో వస్తున్న వెంకటేష్‌

Published on Fri, 12/27/2024 - 07:35

సంక్రాంతికి వస్తున్నాం.. ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు భారీ హిట్‌ అందుకున్నాయి. త్వరలోనే మూడో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే, ఈ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్‌ ఆలపించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆయన గాత్రం నుంచి ఒక పాట రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూడో సాంగ్‌ విడుదల నేపథ్యంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర యూనిట్‌ ఒక ఫన్నీ వీడియోను ప​ంచుకుంది. ఈ సాంగ్‌ను ఎవరితో పాడిద్దాం అని  అనిల్ రావిపూడి చర్చిస్తుండగా సడెన్‌గా వెంకటేష్‌ ఎంట్రీ ఇచ్చేసి నేను పాడతా... నేను పాడతా... అంటూ  పట్టుబట్టి మరీ ఈ పాటని ఆలపించినట్టు చిత్ర యూనిట్‌ ఒక వీడియో పంచుకుంది. అయితే, వెంకటేష్‌ ఇ‍ప్పటికే 2017లో విడుదలైన  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'గురు'లో ఆయన మొదటిసారిగా తన గాత్రంతో  మెప్పించాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెంకటేష్‌ ఆలపించనున్నాడు. త్వరలోనే ఈ పాటని  విడుదల చేయనున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌  నటించారు. వెంకటేశ్‌ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్‌ కానుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)