Breaking News

మొన్న హీరోయిన్‌ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా..

Published on Thu, 01/30/2025 - 14:12

హీరోయిన్‌ మమతా కులకర్ణి (Mamta-kulkarni) సన్యాసం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఇదే బాటలో హీరోయిన్‌ నిఖిలా విమల్‌ సోదరి అఖిలా విమల్‌ (Akhila Vimal) అడుగులు వేసింది. ప్రస్తుతం మహాకుంభమేళాలో ఉన్న ఆమె సన్యాసం (Sanyas) తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె గురువు అభినవ్‌ బాలనందభైరవ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. జూనా పీఠాదీశ్వరులు, అచార్య మహా మండలేశ్వర్‌ స్వామి అవధేశానంద గిరి మహారాజ్‌ సమక్షంలో అఖిల సన్యాసం స్వీకరించింది. ఇక మీదట తన పేరు అవంతిక భారతి అని వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితమే హింట్‌..
కొద్ది రోజుల క్రితం అఖిల కాషాయ వస్త్రాలు ధరించి భక్తిమైకంలో మునిగి ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అది చూసిన జనాలు.. తను ఏం చేయబోతుంది? సన్యాసం తీసుకుంటుందా? ఏంటి? అని అనుమానించారు. అందరూ ఊహించినట్లుగానే సాధ్విగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలోనే మిగిలిన జీవితం గడపనుంది. అఖిల.. హీరోయిన్‌ నిఖిలా విమల్‌కు స్వయానా అక్క. చిన్న వయసులోనే నిఖిల సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగా.. అఖిల మాత్రం పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టింది. 

ఉన్నత చదువులు.. సడన్‌గా సన్యాసం
అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో థియేటర్‌ అండ్‌ పర్ఫామెన్స్‌ సబ్జెక్ట్‌పై రీసెర్చ్‌ చేసింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె సడన్‌గా భక్తి మార్గం పట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. నిఖిల (Nikhila Vimal) విషయానికి వస్తే.. మలయాళంలో పొర్‌ తొళిల్‌, అంజూమ్‌ పాతిరా, తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాలు చేసింది. రీసెంట్‌గా గురువాయూర్‌ అంబలనాడయిల్‌, నునక్కుళి చిత్రాల్లో మెప్పించింది.

(చదవండి: హీరోగా నటించనున్న తమన్‌? 22 ఏళ్ల తర్వాత..!)

సన్యాసం తీసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌
హీరోయిన్‌ మమతా కులకర్ణి ఇటీవలే సన్యాసం తీసుకుంది. ఈమె 1990'sలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ వంటి పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టింది. కరణ్‌ అర్జున్‌, బాజీ, ఆషిఖ్‌ ఆవారా, దిల్‌బర్‌, కిస్మత్‌, జానే జిగర్‌ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్‌ మూవీస్‌తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

డ్రగ్స్‌ కేసులో మమత పేరు
ఆ మధ్య రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్‌ కేసులో మమతా పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాక కెన్యాలోనూ ఓ డ్రగ్స్‌ కేసులో అరెస్టయింది. చాలాకాలంగా కెన్యాలోనే నివసిస్తున్న ఆమె దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. 

కారణం ఏమై ఉంటుందో?
ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. అయితే ఆమె సాధ్విగా మారడంపై విమర్శలు కూడా వచ్చాయి. డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లొచ్చిన నటి సడన్‌గా సన్యాసిగా మారిపోవడం వెనుక కారణమేంటని  ట్రాన్స్‌జెండర్‌, జగద్గురు మహామండలేశ్వర్‌ హిమాంగి సఖి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్‌ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)