Breaking News

అభిమానితో సింగర్‌ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్‌

Published on Mon, 02/12/2024 - 12:53

సాధారణంగా సినీ సెలెబ్రెటీలను అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. నటీనటులతో పాటు సింగర్స్‌ని కూడా అమితంగా ఇష్టపడేవారు ఉంటారు. కొంతమంది గాయకుల లైవ్‌ ఫర్ఫార్మెన్స్‌ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్‌ ఉదిత్‌ నారాయణ కొడుకు ఆదిత్య నారాయణ కూడా ఒకరు. తండ్రికి ఉన్న గుర్తింపు చేత ఆదిత్యకు పేరొచ్చింది. అతను మ్యూజిక్‌కాన్సెర్ట్‌ ఏర్పాటు చేస్తే జనాలు ఎక్కువగానే వెళ్తుంటారు. అయితే తనకోసం వచ్చిన అభిమానులతో ఆదిత్య మాత్రం తరచు గొడవపడుతుంటాడు. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. వీడియో తీస్తున్న ఫ్యాన్‌ ఫోన్‌ని లాక్కొనే దూరంగా పడేశాడు. 

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోని రుంగ్తా కాలేజీలో ఆదిత్య  కచేరీ నిర్వహించారు. ఫ్యాన్స్‌తో పాటు సంగీత ప్రియులు పెద్ద ఎత్తున​ ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌లో భాగంగా ఆదిత్య.. షారుఖ్‌ నటించిన ‘డాన్‌’ మూవీలోని ‘ఆజ్‌ కీ రాజ్‌’ సాంగ్‌ని ఆలపించడం ప్రారంభించారు. పాట పాడుతూ అభిమానుల మధ్యలోకి వచ్చారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని తన మొబైల్‌లో ఆదిత్య పాటను రికార్డు చేస్తూ కనిపించాడు.. వెంటనే ఆదిత్య వచ్చి చేతిలో ఉన్న మైక్‌తో అతన్ని కొట్టి..ఫోన్‌ లాక్కొని దూరంగా విసిరివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఆదిత్య ప్రవర్తించిన తీరును నెటిజన్స్‌ తప్పుపడుతున్నారు. ‘అతను చేసిన తప్పేంటి?..ఓ అభిమానితో ఇలానే ప్రవర్తిస్తారా?’, ఇప్పటికీ తండ్రి పేరుతో బతుకుతున్న ఆదిత్యకు అంత పొగరు ఎందుకు? ’ అని  కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)