Breaking News

ఏఆర్‌.రెహ్మాన్‌ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డా : హీరోయిన్‌

Published on Mon, 03/02/2026 - 07:55

యుక్త వయసులో ప్రేమలో పడడం సహజం. అదేవిధంగా లవ్‌అట్‌ ఫస్ట్‌ సైట్‌ అనేది జరుగుతుంది. నటి మోహిని గుర్తుందా 90 ప్రాంతంలో దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా వెలిగారు. అప్పట్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి బహుభాషా నటిగా రాణించారు. 1987లో కూత్తు పుళక్కంగళ్‌ అనే చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత ఈరమాన రోజావే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అలా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనూ ఆదిత్య 367 చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. అలా మామా బాగున్నావా చిత్రాల్లో నటించారు. 2011 వరకు నటించిన మోహిని భరత్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయ్యారు. 

అయితే అప్పుడప్పుడు సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ భామ పేర్కొంటూ తనకు సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ అంటే చాలా అభిమానం అన్నారు. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తరువాత ఇస్లామ్‌ మతానికి మారినట్లు గుర్తు చేశారు. అప్పుడు తాను చాలా బాధ పడ్డానన్నారు. అయితే రెహ్మాన్‌ హిందువుగా ఉన్నప్పుడు ఆయన్ని తాను చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆయన అదే మతంలో కొనసాగుంటే తన తల్లిదండ్రులను ఒప్పించి ఆయన్నే పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందన్నారు. 

ఏఆర్‌.రెహ్మాన్‌ ప్రస్తుతం పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన హిందీలో తెరకెక్కుతున్న రామాయణ 1, 2 చిత్రాలకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్‌ జిమ్మీర్‌తో కలిసి పనిచేస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్‌.రెహ్మాన్‌ మూన్‌వాక్‌ అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు పూర్తి స్థాయి పాత్రలో నటించడం విశేషం. ఇందులో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇకపోతే రెహ్మాన్‌ గురించి మోహిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)