Breaking News

క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!

Published on Tue, 06/20/2023 - 13:28

'ఆదిపురుష్'కి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అలానే రోజురోజుకీ వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. సినిమా స్టోరీ దగ్గర నుంచి పాత్రల గెటప్స్ వరకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాదన్నట్లు 'ఆదిపురుష్' లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం.. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. దీంతో 'ఆదిపురుష్' టీమ్.. నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ రిలీజ్ చేసింది.

ఏం జరిగింది?

'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. రిజల్ట్, వసూళ్ల గురించి పక్కనబెడితే ఇందులో సీత.. భారతదేశంలో పుట్టింది అనే అర‍్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. రిలీజ్ రోజే దీనిపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ‍్యక్తం చేసింది. దాన్ని తొలిగిస్తేనే ప్రదర్శిస్తామని పట‍్టుబట్టింది. అలానే రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని.. అక్కడ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు.

(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)

సారీ చెప‍్పిన నిర్మాతలు

నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ముదరకముందే 'ఆదిపురుష్' టీమ్ రాజీకి వచ్చింది. క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ని రిలీజ్ చేసింది. భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

లేఖలో ఏముంది?

'నేపాల్ ప్రజల మనోభావాలు ఏ విధంగానైనా దెబ్బతీసుంటే మమ్మల్ని క్షమించాలి. మేం కావాలని ఎవరి సామరస్యాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ఈ మూవీని క్రియేటివ్ కోణంలోనే చూడాలని కోరుకుంటున్నాం. చరిత్రపై ఆసక్తిని పెంచి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులని అలరించాలనే మా ఉద్దేశానికి మద్దతు ఇవ్వాలని మేం అభ్యర్థిస్తున్నాం' అని టీ-సిరీస్ లేఖలో ఉంది.

పడిపోయిన కలెక్షన్స్

ఈ లేఖపై నేపాల్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎన్ని విమర్శలు వస్తున్నాసరే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కలెక్షన్స్ ప్రభంజనం ఆగట్లేదు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి మూడురోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ, నాలుగో రోజు దారుణంగా తగ్గిపోయాయి. ఈ వారం కూడా 'ఆదిపురుష్' నిలబడితేనే లాభాల్లోకి వెళ్తుంది. లేదంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు తప్పవు!?

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)