Breaking News

ప్రేక్షకుల నుంచి అభ్యంతరం.. ‘ఆదిపురుష్‌’ టీమ్‌ కీలక నిర్ణయం

Published on Sun, 06/18/2023 - 13:24

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాపీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది.రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది డైలాగ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లంకలో ఆంజనేయస్వామి చెప్పే డైలాగ్‌ని నెట్టింట ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో ఇలాంటి సంభాషణలు పెట్టడం ఏంటని రామ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల సూచనల మేరకు కొన్ని డైలాగ్స్‌ని మారుస్తామని వెల్లడించింది. 

(చదవండి: ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?)

ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ  ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో  ‘ఆదిపురుష్’ ను చూడవచ్చు’ అని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. డైలాగ్స్‌ మార్పు పెద్ద సాహసమే అయినప్పటికీ.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)