Breaking News

నాపై అసభ్యకరమైన పదాలు వాడారు: ఆదిపురుష్ రైటర్ భావోద్వేగం

Published on Sun, 06/18/2023 - 14:14

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిలిం 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి.

ఇంకా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా డైలాగ్స్‌పై వస్తున్న విమర్శలపై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా స్పందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తానని.. వారిని బాధపెట్టేలా ఉన్న డైలాగులను తొలగిస్తామని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్‌లో రాస్తూ.. 'ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని గౌరవించడం రామాయణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం. ఆదిపురుష్ కోసం చాలా డైలాగ్స్ రాశాను. కానీ కొన్నింటి దగ్గర సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. నేను సీత, రాముని కోసం రాసిన డైలాగ్స్‌కు ప్రశంసలు దక్కలేదు. నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై, నా తల్లిపై అసభ్యకరమైన పదాలు వాడారు. 

ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూసిన సోదరులకు హఠాత్తుగా ఎందుకంత కోపం వచ్చింది. కానీ నాపై సనాతన ద్రోహి అనే ముద్ర వేసేందుకు  మీరు ఎందుకు తొందరపడ్డారో తెలియడం లేదు. మేము సనాతన సేవ కోసమే ఆదిపురుష్‌ని సృష్టించాం. నా డైలాగ్స్‌కు నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను. కానీ ఇది మీ బాధను తగ్గించలేదు. కొన్ని డైలాగులు మిమ్మల్ని బాధపెట్టాయని గ్రహించిన నేను.. సినిమా నిర్మాత, దర్శకుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నా. ఈ వారంలోనే అభ్యంతరకరంగా ఉన్న డైలాగ్స్‌లో మార్పులు చేస్తాం' అని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)