Breaking News

వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?

Published on Fri, 06/23/2023 - 13:21

ప్రభాస్ 'ఆదిపురుష్' కలెక్షన్స్.. రోజురోజుకీ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఏడోరోజు కూడా చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు ఆహాఓహో అనే రేంజులో ఈ చిత్రం రూ.340 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత మాత్రం దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తయారైంది.

(ఇదీ చదవండి: రూ.200 కోట్ల దర్శకుడితో మెగాస్టార్ సినిమా?)

విడుదలకు ముందు 'ఆదిపురుష్'కు ఓ మాదిరి హైప్ ఏర్పడింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి మూడు రోజుల టాక్ ఏంటనేది బయటకొచ్చినా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాణ సంస్థ బయటపెట్టిన దాని ప్రకారం ఫస్ట్ వీకెంట్ లో రూ.340 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఈ సోమవారం నుంచి మాత్రం 'ఆదిపురుష్'కి వరస దెబ్బలు తగులుతూనే ఉన‍్నాయి. ఓవైపు వివాదాలు పెరుగుతుంటే.. మరోవైపు కలెక్షన్స్ తగ‍్గుతూ వచ్చాయి. ఆరు రోజుల్లో రూ.410 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీకి ఏడో రోజు ఓవరాల్ గా రూ.10 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిబట్టి ఓవరాల్ గా తొలివారంలో రూ.420 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 'ఆదిపురుష్' ఇక కోలుకోవడం కష‍్టమే?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)