Breaking News

ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్‌

Published on Wed, 03/06/2024 - 12:34

ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్‌ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది.  ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది?

సౌత్‌ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు
తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్‌ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్‌గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్‌ జంక్షన్‌ సినిమాలో జగపతిబాబు, అర్జున్‌ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఇలా  తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది.  

సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు
ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది.  ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ సీమాన్‌ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్‌ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు విజయలక్ష్మీ. 

ఇదే నా చివరి వీడియో
ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను  ఒక వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్‌ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్‌ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్‌ చేసింది. మంగళవారం పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)