Breaking News

రాజకీయాల్లోకి వస్తానంటోన్న హీరోయిన్‌.. ఆమెనే ఆదర్శం!

Published on Tue, 01/14/2025 - 08:14

సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరుచేసి చూడలేం. నటులే కాదు.. నటీమణులు కూడా రాజకీయ రంగప్రవేశానికి సై అంటున్నారు. ఈ మధ్య నటి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. తాజాగా మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమంటోంది. దక్షిణాదిలో ఓ రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకున్న ఆ నటి ఎవరో తెలుసుకుందాం.

తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తానూ రాజకీయాల్లోకి వస్తానని అంటోంది. తెలుగులో గతేడాది హనుమాన్‌తో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది సచ్‌ దేవ్‌ నికోలయ్‌ను పెళ్లి చేసుకుని నటనను కొనసాగిస్తున్నారు.తాజగా విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటి అంజలి హీరో, హీరోయిన్లుగా నటించిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సంక్రాంతి  కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మీడియాతో ముచ్చటించారు.

12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా చిత్రం పొంగల్‌ సందర్భంగా తెరపైకి రావడంతో అభిమానుల్లో  అంచనాలు పెరిగాయని వరలక్ష్మి శరత్‌ కుమార్ అన్నారు. పోడా పోడీ చిత్రం తరువాత తాను నటించిన రెండవ చిత్రం ఇదేనని చెప్పారు. కమర్శియల్‌ అంశాలతో కూడిన వినోదభరిత కథా సినిమా అన్నారు. పది ఏళ్లలో సినిమా చాలా మారిపోయిందన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న నెగెటివ్‌ కామెంట్స్‌పై వరలక్ష్మి స్పందిచారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్తన్నారని అన్నారు. తాను ఒక సారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళుతుండగా పలువురు వచ్చి తనతో ఫొటోలను తీసుకున్నారన్నారు.

అప్పుడు ఒకతను వచ్చి ఫొటో తీసుకుంటానని అడిగారన్నారు. కానీ నాకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాన్నాననీ, దీంతో అతను తమతో ఫొటో తీసుకోనివ్వరా? మరి మీరెందుకు నటనలోకి వచ్చారని కామెంట్‌ చేశాడన్నారు. అలాంటి వారికి బుద్ధి లేదని, వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా  అన్న ప్రశ్నకు బదులిస్తూ  కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. తనకు స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని అన్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)