Breaking News

అలాంటి వారే సెలబ్రెటీల లైఫ్‌ గురించి మాట్లాడుకుంటారు: నటి అసహనం

Published on Tue, 11/08/2022 - 11:11

నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో విలనిజంతో మెప్పిస్తోంది. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించి లేడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా పాన్‌ ఇండియా చిత్రం యశోదలో నటించింది. సమంత లీడ్‌ రోల్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో ఆమె ఓ కీ రోల్‌ పోషించింది. ఈ చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

చదవండి: విశ్వక్‌ సేన్‌, అర్జున్‌ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి నేపథ్యంలో యశోద సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో సరోగసి అంశం హాట్‌టాపిక్‌ మారింది, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా.. ‘సరోగసీ అనేది కాంప్లికేటెడ్ అంశం కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల దీనిపై చర్చ నడుస్తోంది. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ’ అని పేర్కొంది.

చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే

ఇటీవల లేడీ సూపర్‌ నయనతార సరోగసిని ఆశ్రయించడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్‌ వరలక్ష్మిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పని పాట లేని వాళ్లే పక్కవారి లైఫ్‌ గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పని పాట లేనివాళ్లే ఇలా చేస్తారు. వాళ్లకు ఏం పని ఉండదమో అందుకే పక్కవాళ్ల గురించి ఆలోచిస్తుంటారు’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.

Videos

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)