Breaking News

చైన్నె పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన షకీలా

Published on Wed, 08/13/2025 - 13:49

నటి షకీలా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఓ యూట్యూబర్‌పై ఫిర్యాదు చేయ‌డానికి మంగళవారం ఉదయం చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వ‌చ్చారు. పరువు హత్యలను సమర్థించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న దివాకర్ అనే యూట్యూబర్‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఆమె ఫిర్యాదు చేశారు. నటుడు జీపీ ముత్తుపైన కూడా అత‌డు అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతి వివక్షకు పాల్పడుతున్న యూట్యూబర్‌ దివాకర్‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలిలో జూలై 27న జ‌రిగిన ప‌రువు హ‌త్య ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన దళిత యువ‌కుడిని దారుణంగా న‌రికి చంప‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఐటీ ఉద్యోగిగా ప‌నిచేస్తున్న‌ క‌విన్ కుమార్‌ (25)ని సుర్జీత్ అనే వ్య‌క్తి కొడ‌వలితో న‌రికి హ‌త్య చేశాడు. క‌విన్‌ త‌న చెల్లిని ప్రేమించాడ‌న్న అక్క‌సుతో సుర్జీత్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అక్క‌డి నుంచి పారిపోయి పాల‌యంకోట్టై పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సుర్జీత్ తండ్రి శ‌ర‌వ‌ణ‌న్‌, త‌ల్లి కృష్ణకుమారి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్నారు.

కాగా, క‌విన్ కుమార్ హ‌త్య‌పై త‌మిళ‌నాడు (Tamil Nadu) వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. ప‌రువు హ‌త్య‌ను ప్ర‌జా సంఘాలు, ప్ర‌గ‌తిశీల‌వాదులు ముక్త కంఠంతో ఖండించారు. నిందితుల‌ను చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో యూట్యూబర్‌ దివాకర్‌ ఒక భేటీలో ప‌రువు హ‌త్య‌ను స‌మ‌ర్థించేలా వ్యాఖ్య‌నించారు. హ‌త్య‌కు పాల్ప‌డిన సుర్జీత్ త‌మ కులానికి చెందిన వాడ‌ని పేర్కొంటూ అత‌డిని వెన‌కేసుకొచ్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా నటుడు జీపీ ముత్తు గురించి ప్రస్తావిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీంతో అత‌డిపై న‌టి ష‌కీలా (Shakeela) లిఖిత‌పూర్వ‌కంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)