Breaking News

నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!

Published on Fri, 01/09/2026 - 10:58

సీరియల్‌ నటి సమీరా షెరిఫ్‌ బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. సమీరా మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్లింటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్‌ లాంటి అన్న కూడా వచ్చేవాడు. అంటే ఆయన వయసు కొంచెం పెద్దది. ఆయన నా బుగ్గలు పట్టుకుని ఎక్కువ ముద్దు చేసేవాడు.

దాగుడుమూతలు
ఆ వయసులో నాకర్థం కాలేదు. మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. ఆ బిల్డింగ్‌లో పైన టెర్రస్‌కు వెళ్లే మెట్ల దగ్గరకు మాత్రం ఎవరూ ఎక్కువగా రారు. ఆయన మనం దాగుడుమూతలు ఆడుకుందాం అనేవారు. అప్పుడది చాలా ఫన్‌గా అనిపించేది. పిల్లలందరం కలిసి ఆడేవాళ్లం. మాతోపాటు ఈ అన్న కూడా జాయిన్‌ అయ్యేవాడు. 

కోరికలు తీర్చుకున్నాడు
మనం ఇక్కడ దాక్కుందాం అని నన్ను టెర్రస్‌ పైకి తీసుకెళ్లేవాడు. అక్కడ దాక్కున్నాక నాకు ముద్దులు పెట్టేవాడు. ఒకానొక సందర్భంలో నాకు అసౌకర్యంగా అనిపించేది. కాస్త వయసు వచ్చాక నాకు అర్థమైందేంటంటే.. ఆయన నన్ను ముద్దుచేసేవాడు కాదు, తన కోరికలు నాపై తీర్చుకున్నాడు అని! చెప్పాలంటే ఇది కూడా పిల్లలపై జరిగే లైంగిక దాడిలాంటిదే! ఆ సమయంలో మనకు అంత అవగాహన లేదు.

భయంతో చెప్పలేదు
పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ నేర్పించాలి, వాళ్లకు తెలియాలి అని మా తల్లిదండ్రులు అనుకోలేదు. ఒకవేళ ఇలా జరిగిందని నేను వెళ్లి చెప్పినా ముందు నన్నే ప్రశ్నిస్తారు.. అసలు నువ్వు అక్కడికెందుకు వెళ్లావ్‌? అని తిడతారు. మన పిల్లలకు అలాంటివి జరిగితే నీకు నేనున్నా.. అని ధైర్యం చెప్పాలి.. అలా కాకుండా తిట్టేస్తే వాళ్లు ఏదీ బయటకు చెప్పరు. నేనూ భయంతో చెప్పలేదు. 

చాలామంది జీవితంలో..
ఇలాంటి సంఘటన నాకే కాదు చాలామందికి జరిగింది. వాళ్లు పిల్లలపై ప్రేమ చూపించడం లేదు, కోరిక తీర్చుకుంటున్నారు అని సమీరా చెప్పుకొచ్చింది. సమీరా.. జీవితం, అభిషేకం, భార్యామణి, మనసు మమత, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్‌లో నటించింది. నటి సన కుమారుడు అన్వర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో స్థిరపడింది. తనకు ఇద్దరు కుమారులు సంతానం. 

 

 

చదవండి: త్వరలో బిగ్‌ న్యూస్‌ చెప్తానంటున్న చిన్నారి పెళ్లికూతురు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)