Breaking News

పెళ్లిపై ఆలోచన లేదు: సాయి పల్లవి

Published on Fri, 03/27/2026 - 07:18

ప్రయత్నం ఎన్నటికీ వృథా కాదు.. వెంటనే కాకున్నా, కొద్ది కాలం తరువాత అయినా దాని ఫలితం ఉంటుంది. నటి సాయి పల్లవి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ కోయంబత్తూరు భామకు సినిమాల్లో నటించాలన్నది చిన్నప్పటి నుంచి ఆశ. అయితే వెంటనే  తన ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చదువుపై దృష్టి సారించి డాక్టర్‌ కూడా అయ్యారు. ఆ తరువాత కూడా నటనపై తన ఆసక్తి తగ్గాక పోవడంతో డాన్స్‌ లో శిక్షణ పొందారు. ఆపై తనలోని నటిని చూపేందుకు  సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ దృష్టిలో పడ్డారు. 

ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రేమలులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతేకాదు అందులో టీచర్‌ పాత్రకు పెద్ద పేరు వస్తుందని సాయి పల్లవి కూడా ఊహించి ఉండరు. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన పోయారు. చాలా మంది గ్లామర్‌ క్రేజ్‌తోపాటు, అవకాశాలను తెచ్చి పెడుతుందని భావిస్తారు. అందులో నిజం లేకపోయినప్పటికీ, సాయి పల్లవి మొదటి నుంచి సహజత్వానికి ప్రాధాన్యత నటిస్తున్నారు. అదే ఆమెకు ప్లస్‌ అయ్యింది కూడా. సాయి పల్లవి నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఈమె నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రం ఘనవిజయం సాధించింది, ఆ తరువాత తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన తండేల్‌ చిత్రం విజయాన్ని సాధించింది. ఇటివల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

అక్కడ సాయి పల్లవి, అమీర్‌ ఖాన్‌ వారసుడు జునైద్‌ ఖాన్‌ కలిసి నటించిన ఏక్‌ దిన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్‌కు జంటగా మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా  చాలా బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కచ్చితంగా చెప్పారు. ప్రస్తుతానికి తాను సింగిల్‌ అని కూడా చెప్పారు .కాగా  ఈ  33 ఏళ్ల భామ చెల్లెలు పూజా కన్నన్‌ రెండేళ్ల ముందే పెళ్లి చేసుకున్నారు. మరి సాయి పల్లవికి పెళ్లి ఘడియలు ఎప్పుడు వస్తాయో ఏమో!

#

Tags : 1

Videos

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు

రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన

తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు

వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)